ఆకేరు న్యూస్, వరంగల్: శరన్నవరాత్రోత్సవాలు ప్రసిద్ధ భద్రకాళీ అమ్మవారి దేవాలయంలో అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అభిషేకాలతో పాటు ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం భద్రకాళీ అమ్మవారిని గాయత్రీదేవిగా సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయ ప్రాంగణంలో క్యూలైన్లలో బారులు తీరడంతో పాటు భద్రకాళీ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. కాగా, ఉత్సవాల్లో రెండో రోజైన శుక్రవారం అమ్మవారు అన్నపూర్ణేశ్వరిగా దర్శనమిచ్చి ఉదయం మకర, సాయంత్రం చంద్రప్రభ వాహనంపై ఊరేగారు. తొమ్మిది రోజులపాటు జరిగే ఉత్సవాలలో అమ్మవారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. ధ్వజారోహణంతో మొదలయ్యే శరన్నవరాత్రి ఉత్సవాలు, తెప్పోత్సవంతో ముగియనున్నాయి.
………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
