* ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఘాతుకం
* కాలిబాటపై నిద్రిస్తున్న ఇద్దరు గిరిజనుల దుర్మరణం
* మరో 15 మందికి గాయాలు.. ఏడుగురి పరిస్థితి విషమం
ఆకేరు న్యూస్ డెస్క్ : ఫ్రెండ్ పుట్టినరోజు పార్టీ(Birthday Party )లో ఫుల్‌గా తాగేశాడు. ఆ మత్తులో కారు నడిపి ఇద్దరి ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. మరో 15 మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. నాగపూర్ (Nagpur) లో జరిగిన ఈ ఉదంతం కొన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. స్నేహితుడి పుట్టిన రోజు సందర్భంగా భూషణ్ లనేవర్ (Bhushan Lanjewar) అనే ఫైర్ ఇంజనీర్ (Fire Engineer) ఐదుగురితో కలిసి దాబాలో మందు పార్టీ చేసుకున్నాడు. అనంతరం వీరంతా కారులో బయటకు వచ్చారు. భూషణ్ వేగంగా నడుపుతూ దిఘోరీ టోల్‌ప్లాజా (Dighori Toll Plaza) సమీపంలోని పాదబాటపై నిద్రిస్తున్న రాజస్థాన్ కూలీ (Rajasthan labor) లపైకి పోనిచ్చాడు. తప్పించుకునే ప్రయత్నంలో కారును వెనక్కు, ముందుకు నడిపించాడు. దీంతో బగాడియా తెగకు చెందిన గిరిజన మహిళ కాంతీబాయి (Kantibai) (42), మరో వ్యక్తి సీతారాం (Sitaram) (30) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 15 మంది కూలీలు గాయపడ్డారు. వీరిలో తీవ్ర గాయాలైన ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. కారులో వాన్ష్ జాదె, సన్మయ్ పత్రీకర్, అథర్వ వనాయత్, అథర్వ మోగ్రే, హృషికేశ్ చౌబే ఉన్నారని, వీరంతా ఇంజనీరింగ్ (Engineering), డిగ్రీ (Degree) విద్యార్థులని పోలీసులు తెలిపారు.అందరినీ అరెస్టు చేసి ఐపీసీ సెక్షన్ 304, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బుధవారం వరకు కోర్టు వీరిని పోలీస్ కస్టడీకి అప్పగించింది.
———————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
