AP Weather
* ఏపీకి వర్ష సూచన
AP Weather| ఆకేరు న్యూస్, డెస్క్: బంగాళాఖాతంలో మరో వాతావరణ వ్యవస్థ ఏర్పడింది. దక్షిణ తీర మయన్మార్ పరిసరాల్లో ఉన్న అల్పపీడనం ఉత్తర అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న మయన్మార్ తీర ప్రాంతంలో కొనసాగుతున్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఇది రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ వ్యవస్థ ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ తదుపరి రెండు రోజుల్లో మయన్మార్–బంగ్లాదేశ్ తీర ప్రాంతాల వైపు వెళ్లే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. ప్రస్తుతం దీని కదలికను వాతావరణ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది.
ఏపీపై ప్రభావం?
వాయుగుండం కదలిక, తీవ్రత ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమలో రానున్న రోజుల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలను వాతావరణ శాఖ పర్యవేక్షిస్తోంది.
సముద్రంలో వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఇప్పటికే సముద్ర పరిస్థితులు రఫ్ నుంచి వెరీ రఫ్‌గా ఉండే అవకాశం ఉందని IMD పేర్కొంది. వాయుగుండం కదలికకు అనుగుణంగా ఏపీకి సంబంధించిన వర్షాలు, గాలులపై మరిన్ని హెచ్చరికలను వాతావరణ శాఖ విడుదల చేసే అవకాశం ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
