Ramayana
* నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ప్లాన్?
Ramayana రణ్బీర్ కపూర్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న భారీ చిత్రం రామాయణం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం తొలుత నవంబర్ 6న థియేటర్లలో విడుదల కానుందని ప్రకటించారు. అయితే తాజాగా విడుదల తేదీని ఒక రోజు ముందుకు మార్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం.
నవంబర్ 5న రిలీజ్?
బాలీవుడ్ హంగామా కథనం ప్రకారం.. ‘రామాయణం పార్ట్ 1’ను నవంబర్ 5న గురువారం విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తేదీకి సంబంధించిన తుది నిర్ణయం త్వరలోనే వెలువడే అవకాశం ఉందని సమాచారం.
వరల్డ్ వైడ్ రిలీజ్
మరోవైపు భారత్తో పాటు ఓవర్సీస్ మార్కెట్లలోనూ ఒకే రోజున సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు బాలీవుడ్ హంగామా పేర్కొంది. నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే అంశంపై సంబంధిత వర్గాల మధ్య దాదాపు అంగీకారం కుదిరినట్లు ఓ వర్గం తెలిపింది. అయితే కొత్త విడుదల తేదీపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
