A Mahesh , warangal congress leader dead in Petrol Attack
* పెట్రోల్ దాడిలో గాయపడిన కాంగ్రెస్ నాయకుడి మృతి
* జనగామ నుంచి తిరిగి వరంగల్‌కు మృతదేహం
అకేరు న్యూస్ వరంగల్ : వరంగల్‌లోని ఏనుమాములలో అర్ధరాత్రి జరిగిన పెట్రోల్ దాడిలో గాయపడిన కాంగ్రెస్ నాయకుడు అడప మహేష్ మృతి చెందారు. దుండగులు ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆయనను బంధువులు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించారు. , పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలింస్తుండగా జనగామ దగ్గర ఆయన మృతి చెందినట్లు సమాచారం.. పోస్ట్ మార్టం నిమిత్తం వరంగల్ కు తీసుకువస్తున్నారు.
* వరంగల్ లో హై అలర్ట్…
హైదరాబాద్ నిమ్స్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో అడప మహేష్ మృతి చెందడంతో ఏనుమాముల ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది.. ఆ ప్రాంతంలో ఘర్షణలు తలెత్తె అవకాశం ఉన్నందున పోలీసులు పెద్ద ఎత్తున బలగాలు అక్కడికి చేరుకుంటున్నాయి.. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
