* రైల్వే జీఎంను కలిసిన ఎమ్మెల్యేలు, ఎంపీ
ఆకేరున్యూస్, హైదరాబాద్: కాజీపేట బస్టాండ్ ఏర్పాటు, రైల్వే డివిజన్ ఏర్పాటుకు కృషి చేయాలని సికింద్రాబాద్ రైల్వేభవన్‌లో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ జీఎం అరుణ్ కుమార్ జైన్, డీజీఎం ఉదయ్ నాథ్ కోట్లను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్య మర్యాదపూర్వకంగా కలిసారు. ఖాజీపేట రైల్వే డివిజన్, కాజీపేట ఆవరణలో నూతన బస్టాండ్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే కాజీపేట మీదుగా వెళ్లాల్సి ఉంటుందని ప్రజా రవాణా దృష్ట ప్రజలు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాజీపేట ప్రధాన రహదారి వెంట ఉన్న రైల్వే స్థలాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం నూతన బస్‌స్టేషన్ నిర్మాణానికి సిద్ధంగా ఉందని తెలియజేశారు. ఖాజీపేట ప్రజల కోరిక కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలనీ కోరారు. ఈ సందర్బంగా పైఅంశలపై జీఎం అరుణ్ కుమార్ జైన్ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యేలు, ఎంపీ తెలిపారు.

………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
