ఆకేరున్యూస్, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం రోజుల ప్రారంభించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నారాయణపేట వాసి గవినోళ్ల శ్రీనివాస్.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. భూమి లేని రైతు కూలీలకు ఏటా రూ. 12 వేలు చెల్లించేలా రేవంత్ సర్కార్ పథకాన్ని రూపొందించింది. కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కూలీలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని.. పురపాలికల్లో ఉన్న రైతు కూలీలకు డబ్బులు ఇవ్వడం లేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. 129 పురపాలకాల్లో 8 లక్షల మందికి పైగా రైతు కూలీలు ఉన్నారని.. గ్రామాల్లో ఉన్న వారికి ఇచ్చి పురపాలకాల్లో ఉన్న వాళ్లకు ఇవ్వకపోవడం సరైంది కాదని పేర్కొన్నారు. రైతు కూలీలు ఎక్కడున్న అందరూ సమానమేనని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం.. పురపాలకాల్లోని రైతు కూలీలకు ఆత్మీయ భరోసా పథకం వర్తించడంపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీజే ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
……………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
