పాత బస్తీలో మీడియాతో మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ పక్కన మంత్రి అజారుద్దీన్
*ప్రారంభానికి సిద్ధం కావాలి
* స్టీల్ బ్రిడ్జి నిర్మాణంపై మంత్రి పొన్నం ఆదేశాలు
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : హైదరాబాద్‌లో స్టీల్ బ్రిడ్జి ( Old city Steel bridge ) ని అతిత్వరలోనే ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈనెలలోనే అది ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రయత్నాలు చేస్తోంది. పనులను నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఈమేరకు సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తో కలిసి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, ( Ponnam Prabhakar) అజారుద్దీన్, ( Azaharuddin ) స్థానిక మలక్‌పేట ఎమ్మెల్యే బలాలతో కలిసి పరిశీలించారు. పనులు ఎక్కడి వరకు వచ్చాయి? ప్రారంభానికి ఇంకేమి అడ్డంకులు ఉన్నాయి? అందుకు కారణాలు ఏంటని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిగిలి ఉన్న పనులను కూడా సత్వరం పూర్తి చేసి, స్టీల్ బ్రిడ్జిని వెంటనే అందుబాటులోకి తెచ్చేలా చూడాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఈ నెలలోనే ప్రారంభం?
అన్ని పనులనూ త్వరగా పూర్తి చేసి ఈ బ్రిడ్జిని ఈ నెలలోనే ప్రారంభించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. చంచల్‌గూడ జైలు నుంచి సైదాబాద్ మీదుగా ఒవైసీ హాస్పిటల్ వరకు సుమారు 2.58 కిలోమీటర్ల ఈ బ్రిడ్జిని నిర్మించారు. పనులు తుది దశకు చేరుకున్నాయి. నాలుగు లేన్ల స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే లక్షలాది వాహనదారులకు మేలు జరగనుంది. సిగ్నల్ ఫ్రీ కారిడార్‌గా అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్టుతో ప్రయాణ సమయం 30 నిమిషాల నుంచి 5 నిమిషాలకు తగ్గడంతో పాటు ఇంధన వినియోగం, ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం కూడా గణనీయంగా తగ్గనున్నాయి. ముఖ్యంగా బడంగ్పేట్, ఆదిభట్ల, సంతోష్‌నగర్ ప్రాంతాల నుంచి ఎంజీబీఎస్, కోటి, అబిడ్స్, సికింద్రాబాద్ తదితర నగర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు కూడా ప్రయాణసమయం తగ్గనుంది. దీంతో పనులను మంత్రులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. తాజాగా మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ పనులను పరిశీలించి త్వరగా పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు.
——————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
