* కాంగ్రెస్ సర్కారుపై కేటీఆర్ ట్వీట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కారు ఆరు నెలల పాలనను విమర్శిస్తూ బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. కరెంట్ కోతలు, విద్యుత్ సబ్స్టేషన్ల ముట్టడి, రైతుల ఆందోళనలను గుర్తు చేస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. పదేళ్లు కనిపించని కరెంట్ కోతలను చూస్తున్నామని, విద్యుత్తు సబ్ స్టేషన్ల ముట్టడిలను చూస్తున్నామని విమర్శించారు.
కేటీఆర్ చేసిన ట్వీట్ యథాతథంగా..
‘‘6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు..!
6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతం..!!
పదేళ్లు కనిపించని కరెంట్ కోతలను చూస్తున్నం
విద్యుత్తు సబ్ స్టేషన్ల ముట్టడిలను చూస్తున్నం
కాలిన మోటర్లు, పేలిన ట్రాన్స్ఫార్మర్లు చూస్తున్నం
ఇన్నాళ్లకు ఇన్వర్టర్లు-జనరేటర్ల మోతలు చూస్తున్నం
సాగునీరు లేక ఎండిన పంట పొలాలను చూస్తున్నం
ట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు చూస్తున్నం
చుక్కనీరు లేక బోసిపోయిన చెరువులను చూస్తున్నం
పాత అప్పు కట్టాలని రైతులకు నోటీసులు చూస్తున్నం
రైతుబంధు కోసం నెలలపాటు పడిగాపులు చూస్తున్నం
తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కు లేని దుస్థితి చూస్తున్నాం
పదేళ్ల తరువాత అన్నదాతల ఆత్మహత్యలు చూస్తున్నం
చివరికి ఇవాళ జోగిపేటలో..
విత్తనాల కోసం రైతుల మొక్కులు…
క్యూలైన్ లో పాసుబుక్కులు చూసినం…!
కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదు..!
అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు..!!
ఈ వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో..
ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో..!!’’
————————-