Maripeda Woman Dies in US Road Accident
* ఇంటికి వెళ్తుండగా వెంటాడిన మృత్యువు..
ఆకేరు న్యూస్, నెట్వర్క్ : అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో ( USA – St Louis) జరిగిన రోడ్డు ప్రమాదంలో మరిపెడకు చెందిన మహిళ దుర్మరణం చెందింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ ( Maripeda ) కు చెందిన దారం శ్రీనివాస్, జ్యోతిల కుమార్తె దారం సుప్రజ ( Daram Supraja ) గత కొంత కాలంగా అమెరికాలో ఉంటున్నారు. సెయింట్ లూయిస్‌లో రెస్టారెంట్ నిర్వహిస్తున్న ఆమె, రాత్రి రెస్టారెంట్ మూసివేసి స్నేహితురాలితో కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. కొద్దిసేపటికే ఆమె ప్రయాణిస్తున్న కారును వేగంగా వచ్చిన ట్రక్ ను ఢీకొనడంతో సుప్రజ అక్కడికక్కడే మృతి చెందగా, స్నేహితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. సుప్రజ భర్త రంజిత్ కొదుమూరి మహబూబాబాద్ జిల్లా జయ్యారం గ్రామానికి చెందినవాడే.. సుప్రజ కు మూడేళ్ళ కుమారుడు ఉన్నారు.
——————-

Please tell us what is wrong. Your report will be sent to the website team.
