Warangal Fire Accident
* సాయి ప్లాస్టిక్స్‌లో ఎగిసిపడుతున్న మంటలు..
* ఎన్టీఆర్ నగర్ వద్ద కలకలం
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ ఏనుమాములలోని ఎన్టీఆర్ నగర్ వద్ద ఉన్న సాయి ప్లాస్టిక్స్‌లో ఆదివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి ఎగిసిపడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో పొగలు వ్యాపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
ప్లాస్టిక్స్‌కు సంబంధించిన వస్తువులు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నట్లు సమాచారం. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
