Palakurthi MLA Yashaswini Reddy
ఆకేరు న్యూస్, జనగామ: జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతోంది. పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామ సర్పంచ్ బొడిగ ప్రదీప్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి నివాసంలో ఆమె సమక్షంలో ప్రదీప్ కుమార్ గౌడ్ అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
సర్పంచ్‌ను పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే… యశస్విని రెడ్డి, ఆయనకు పార్టీ కండువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేసే ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.
* పార్టీ బలోపేతానికి కృషి చేస్తా… సర్పంచ్ ప్రదీప్ కుమార్ గౌడ్
కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం సర్పంచ్ బొడిగ ప్రదీప్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితుడినై పార్టీలో చేరినట్లు తెలిపారు. లక్ష్మీనారాయణపురం గ్రామాభివృద్ధితో పాటు, మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ శాయశక్తులా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
ఈ చేరికల కార్యక్రమంలో పాలకుర్తి మండలానికి చెందిన పలువురు ముఖ్య కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
