Mulugu Emergency Response Vehicle
ఆకేరు న్యూస్, ములుగు:
విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేందుకు టీజీఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో మంజూరైన ఇసుజు డి-మ్యాక్స్ ఎస్-క్యాబ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (ఈఆర్టీ) వాహనాన్ని ములుగు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ బి. భిక్షపతి మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో ఏర్పడే అంతరాయాలు, బ్రేక్డౌన్ పరిస్థితులు, నిర్వహణ పనులు, దెబ్బతిన్న డీటీఆర్ల తరలింపు, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం వంటి అత్యవసర సేవలను వేగంగా అందించేందుకు ఈ వాహనం ఉపయోగపడుతుందని తెలిపారు.
ములుగు డివిజన్ పరిధిలోని మారుమూల ప్రాంతాల్లో కూడా విద్యుత్ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించి వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంలో ఈ వాహనం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పి. నాగేశ్వరరావు డివిజనల్ ఇంజనీర్, ఎన్. వేణుగోపాల్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, మహేందర్ ఏఈ కమర్షియల్, కృష్ణారావు ఏఈ టెక్నికల్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
