నవనీత్ కౌర్ వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసుదుద్దీన్ ఒవైసీ కౌంటర్
ఆకేరున్యూస్, హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆ పార్టీ నేత, సినీ నటి నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసుదుద్దీన్ ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. ఈసారి బీజేపీ గెలిపిస్తే.. హైరాబాద్ను పాకిస్తాన్ కాకుండా కాపాడతామని అన్నారు. అంతేకాకుండా.., పోలీసులను 15 నిమిషాలు పక్కకు పెడితే మా తడాఖా ఏంటో చూపిస్తామని అక్బరుద్దీన్ ఒవైసీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై నవనీత్ కౌర్ మాట్లాడుతూ.. చిన్నోడికి చెబుతున్నా.. 15 నిమిషాలు ఎందుకు.. మాకైతే 15 సెకన్లు చాలు.. అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై తాజాగా అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ, ‘‘మేం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం.. 15 సెకన్లు ఎందుకు గంట సమయం తీసుకోండి. ముస్లింలను ఏం చేస్తారో చేసుకోండి. మాటలు ఎందుకు చేసి చూపించండి. మేం ఇక్కడే ఉన్నాం కదా. అధికారం మీ దగ్గరుంది.. ఏం ఏస్తారో చేయండి’’ అని కౌంటర్ ఇచ్చారు.
————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
