Gold Chain Theft Case
ఆకేరు న్యూస్ దేవరుప్పుల:- మండలంలోని పెద్ద మడూర్ గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలి మెడ లో ఉన్న బంగారు గొలుసు చోరీ కేసును 24గంటల్లోనే పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించిన వివరాలను సీఐ జానకిరామ్ రెడ్డి శనివారం సాయంత్రం వెల్లడించారు. పెద్దమడూర్ గ్రామనికి చెందిన వృద్ధురాలు కప్పెర యాదమ్మ శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రి స్తుండగా ఓ దుండగుడు చొరబడి మెడలోని 3తులాల బంగారు గొలుసుకు లాక్కొని పరారయ్యడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం ఆధారాలతో దర్యాప్తు చేపట్టగా నిందితుడు అదే గ్రామానికి చెందిన కప్పెర అనిల్ గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడైన అనిల్ బాధితురాలైన పెద్ద కుమారుడు అంజయ్య కొడుకే కావడంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. దీంతో 3 తులాల బంగారు గొలుసు స్వాధీనం చేసుకుని, అతడిని రిమాండ్ కు తరలించారు. కేసును త్వరితగతిన ఛేదిం చిన ఎస్సై ఊర సృజన్ కుమార్ ను,పోలీస్ సిబ్బందిని డీసీపీ రాజ మహేంద్ర నాయక్, ఏసీపీ నర్సయ్య,సీఐ జీనకి రామ్ రెడ్డి అభినందించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
