Madanapalle
Madanapalle| ఆకేరు న్యూస్, మదనపల్లె: రాయలసీమలో ఉద్యాన పంటల సాగు, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌ను మరింత విస్తరించేందుకు ప్రతిపాదించిన హార్టికల్చర్ హబ్‌కు శుక్రవారం శంకుస్థాపన జరగనుంది. మదనపల్లెలో జరిగే ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరుకానున్నారు.
రాయలసీమను ఉద్యాన రంగానికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిపాదించింది. మొత్తం సుమారు రూ.లక్ష కోట్ల పెట్టుబడితో హార్టికల్చర్ హబ్‌ను అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించింది.
201 క్లస్టర్ల ఏర్పాటు
ప్రాజెక్టులో భాగంగా రాయలసీమలోని 10 జిల్లాల్లో 201 ఉద్యాన క్లస్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆయా ప్రాంతాల్లో ఉద్యాన పంటల ఉత్పత్తితో పాటు పంటల ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ వ్యవస్థలను అభివృద్ధి చేయనున్నారు.
భారీ పెట్టుబడుల ప్రణాళిక
ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వపరంగా సుమారు రూ.40,352 కోట్ల పెట్టుబడులు సమకూర్చాలని ప్రతిపాదించారు. మరోవైపు ప్రైవేట్ రంగం నుంచి దాదాపు రూ.60 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా ప్రణాళిక రూపొందించారు.
హార్టికల్చర్ హబ్ ద్వారా రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు, ప్రాసెసింగ్ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఉపాధి అవకాశాలను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రేపటి శంకుస్థాపనతో రాయలసీమలో ఉద్యాన రంగాన్ని విస్తృత స్థాయిలో అభివృద్ధి చేసే ప్రణాళికకు అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
