Wardhannapet Series of Thefts
* బంగారం, వెండి, నగదు అపహరణ
ఆకేరు న్యూస్,వరంగల్: వర్ధన్నపేట మండలంలోని కట్ర్యాల, ఇల్లంద గ్రామాల్లో వరుస చోరీలు కలకలం రేపాయి. తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దుండగులు బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించారు.
కట్ర్యాల గ్రామంలో చెంగల చంద్రమ్మ ఇంటి తాళాలు పగులగొట్టి దుండగులు ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం తులం బంగారు చైన్, మూడు తులాల వెండి అపహరించినట్లు సమాచారం.
అదే విధంగా ఇల్లంద గ్రామంలో కీసర వినయ్ ఇంట్లోకి చొరబడిన దుండగులు రెండు తులాల బంగారం, 23 తులాల వెండి, రూ.60 వేల నగదు దొంగిలించినట్లు తెలిసింది.
రెండు గ్రామాల్లో వరుసగా చోరీలు జరగడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీలకు పాల్పడిన దుండగులను గుర్తించేందుకు పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
