Published:
Updated: 27 Jan 2025 • 12:08 PM
ఆకేరున్యూస్, వనపర్తి: ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎస్టీ గురుకుల హాస్టల్లో ఆదివారం ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా.. సోమవారం ఎస్సీ హాస్టల్లో మరొక విద్యార్థి మరణించాడు. సోమవారం ఉదయం వనపర్తి జిల్లా గోపాలపేట ఎస్సీ హాస్టల్లో ఉంటూ 8వ తరగతి చదువుతున్న భరత్ అనే విద్యార్థికి మూర్చ రావడంతో హాస్టల్ సిబ్బంది వనపర్తిలోని ఎంసీహెచ్ హాస్పిటల్కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతని స్వస్తలం గోపాలపేట మండలంలోని ఏదుట్ల గ్రామం కగా.. విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
…………………………….
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
