Warangal Traffic Safety Awareness
అకేరు న్యూస్ వరంగల్ : వరంగల్ నగరంలో ప్లాటినం జూబ్లీ హైస్కూల్ విద్యార్థులు వరదలు, ట్రాఫిక్ భద్రతపై ఫ్లాష్ మాబ్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అబ్బనికుంట, పోచమ్మ మైదాన్, హెడ్ పోస్ట్ ఆఫీస్ ప్రాంతాల్లో ఈ ప్రదర్శనలు జరిగాయి. వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ టి.సత్యనారాయణ మాట్లాడుతూ
రోడ్డుపై ట్రాఫిక్ పోలీసులు ఇస్తున్న సూచనలను, ఆదేశాలను ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ కంటే ముందుగా పాటించడం ప్రతి వాహనదారుడి విధి. డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ (PUC), బీమా పత్రాలను ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలి. అనుమానం వచ్చి పోలీసులు వాహనాన్ని ఆపినప్పుడు సహనంతో వ్యవహరించండి అని తెలిపారు.
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుజాత ఈ కార్యక్రమంలో పాల్గొని భద్రతా చర్యలపై సూచనలు చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
