* న్యాయవ్యవస్థ బతికే ఉంది
* సీపీఐ నారాయణ
ఆకేరున్యూస్ డెస్క: దేశంలో న్యాయవ్యవస్థ ఇంకా బతికే ఉందని భారత దేశంలో ప్రజాస్వామ్యాన్ని న్యాయవ్యవస్థనే కాపాడుతోందని సీపీఐ నారాయణ (CPI NARAYANA)అన్నారు. ఇటీవల చూస్తున్న పరిణామాలు చూస్తుంటే న్యాయవ్యవస్థ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల భవిష్యత్‌పై భరోసా కలుగుతోందని అన్నారు. దేశంలో ప్రజాస్వమ్యాన్ని కాపాడేది న్యాయవ్యవస్థే అని నారాయణ అన్నారు. మోదీ సర్కార్ మిగతా సంస్థలను నిర్వీర్యం చేసి తన గుప్పిట్లో పెట్టుకుందని నారాయణ విమర్శించారు. రాష్ట్రపతితో పాటు ఎన్నికల సంఘం(ELECTION COMMISSION),నీతి అయోగ్(NEETHI AYOG), సీబీఐ(CBI) లు మోదీ (MODI) చేతిలో కీలుబొమ్మలుగా మారాయని నారాయణ అన్నారు.బీజేపీతర రాష్ట్రాల పట్ల మోదీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య సూత్రాలకు వ్యతిరేకంగా ఉందన్నారు. నాన్ బీజేపీ రాష్ట్రాలపై గవర్నర్ లను ఉసి గొల్పుతున్నారని నారాయణ అన్నారు. రాష్ట్రపతి కేవలం రబ్బర్ స్టాంప్‌గా మారారని నారాయణ విమర్శించారు.ఈసీని, ఈడీని, సీబీఐని గ్రిప్‌లో పెట్టుకొన్నారని విమర్శించారు.సెంట్రల్లో కూడా క్రైసిస్ వచ్చే ప్రమాదం ఉందని, దాన్ని అధిగమించాలంటే దేశంలో ఉన్న బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనిపై సీపీఐ చర్చిస్తున్నదని తెలిపారు. సెప్టెంబర్ 22 నుంచి చండీగఢ్‌లో జరిగే జాతీయ మహాసభల్లో విశాల ప్రాతిపదికన ‘యాంటీ బీజేపీ ఫ్రంట్’ ఏర్పడే దిశగా కృషి చేస్తామని అన్నారు.
…………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
