పోసాని కృష్ణ మురళి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై సినీ నటుడు పోసాని కృష్ణ మురళి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా ఫేక్ వీడియాలపై కూడా స్పందించారు. ఫేక్ వీడియోలకు ఉన్న విలువ ఏపీ సీఎం జగన్ ప్రాణాలకు లేదా.. అని ప్రశ్నించారు. జగన్ను చంపుతామనం చంద్రబాబు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారని, ఆ వ్యాఖ్యలను ఒక్కరైనా ఖండించారా అని ప్రశ్నించారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు దేవుడు అయిపోయాడా అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే హత్యలు చేసినా పర్లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనే రాయి వేయించుకున్నట్లు పవన్ చెప్పడం హ్యాస్యాస్పదం అన్నారు. దేశంలో నంబర్ వన్ డాన్ చంద్రబాబు అని విమర్శించారు.
—————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
