ఆకేరు న్యూస్ , హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన వేళ, కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నేటితో (ఫిబ్రవరి 3) ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది.
మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల లోపు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. గడువు ముగిసిన వెంటనే ఎన్నికల అధికారులు బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు.ఈసారి పురపోరులో పోటీ తీవ్రంగా ఉంది. అధికారుల గణాంకాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..
మొత్తం వార్డులు: 2,996
దాఖలైన నామినేషన్ సెట్లు: 29,694
మొత్తం అభ్యర్థులు: 20,313
పరిశీలన అనంతరం అర్హత పొందినవి: 19,608
రెబల్ అభ్యర్థులను బుజ్జగించే పనిలో ప్రధాన పార్టీలు తలమునకలయ్యాయి. ఉపసంహరణ గడువు ముగిస్తే గానీ అసలు ఏ పార్టీ నుంచి ఎవరు బరిలో ఉంటారు? స్వతంత్రుల ప్రభావం ఎంత? అనే విషయంపై స్పష్టత రానుంది. సాయంత్రం కల్లా అభ్యర్థుల వారీగా గుర్తుల కేటాయింపు ప్రక్రియ కూడా మొదలుకానుంది.
…………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
