Kadiyam Srihari NPDCL review meeting
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
హన్మకొండలోని ఎన్పిడిసిఎల్ ప్రధాన కార్యాలయంలో సీఎండీ వరుణ్ రెడ్డితో కలిసి విద్యుత్, ట్రాన్స్ కో, ఇంజినీరింగ్ శాఖ అధికారులతో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 7న ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క నియోజకవర్గంలో పలు విద్యుత్ సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న నేపథ్యంలో అందుకు సంబందించిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై విద్యుత్ శాఖ అధికారులతో చర్చించారు. ఉప ముఖ్యమంత్రి పర్యటనకు సంబందించి అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. నియోజకవర్గంలో వేలేరు మండలం పీచరలో 132/33 కేవి సబ్ స్టేషన్, చిల్పూర్ మండలం కొండాపూర్, జఫర్ గడ్ మండలం సాగరం, రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామాలలో 33/11కేవి సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవం. జఫర్ గడ్ మండలం కేంద్రంలో 132/33కేవి సబ్ స్టేషన్, చిల్పూర్ మండలం లింగంపల్లి, పల్లగుట్ట, నష్కల్ గ్రామాలలో 33/11కేవి సబ్ స్టేషన్లకు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమర్క శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా జఫర్ గడ్ లో 5 వేల మందితో భహిరంగ సభకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీనిపై సీఎండీ వరుణ్ రెడ్డిని అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. జఫర్ గడ్ 132/33కేవి సబ్ స్టేషన్ కు సంబందించిన భూ కేటాయింపుకు ట్రాన్స్ కో అధికారులు వెంటనే చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలని ఇవ్వాలని అన్నారు. దీనిపై వెంటనే సీఎండీ వరుణ్ రెడ్డి సంబంధిత అధికారులను మీటింగ్, భూ కేటాయింపుకు సంబంధించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో విద్యుత్ శాఖ ట్రాన్స్ కో, ఇంజనీరింగ్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
