Padi Kaushik Reddy Temple Visit
* వాహనంలో ఆలయ ప్రదక్షిణ చేసిన ఎమ్మెల్యే
ఆకేరు న్యూస్, కమలాపూర్ :
కమలాపూర్ మండలం ఉప్పల్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో అత్యంత కీలకమైన స్వామివారి శకటోత్సవం, బండ్ల తీర్థం సందర్భంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శుక్రవారం రాత్రి ఆలయాన్ని సందర్శించి, స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మహారాజు స్వామి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించి, స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. బండ్ల తీర్థం ఆచారాన్ని పాటిస్తూ సాంప్రదాయబద్ధంగా గుడి చుట్టూ బండ్లు తిరిగే వాహనాలను అనుసరిస్తూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన వాహనంలో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. తన కాన్వాయ్‌తో కలిసి ఆలయ ప్రదక్షిణ చేసిన అనంతరం భక్తులతో ముచ్చటించి, ఉత్సవ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
