Telangana Pulse Polio Programme 2026
ఆకేరు న్యూస్, డెస్క్:
రాష్ట్రవ్యాప్తంగా నేడు (జూన్ 28) పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందించేందుకు ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
* ప్రతి చిన్నారికి తప్పనిసరిగా..
పల్స్ పోలియో కార్యక్రమంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
* బూత్‌లు, మొబైల్ బృందాలు సిద్ధం
నేడు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పోలియో బూత్‌లలో పిల్లలకు చుక్కలు వేయనున్నారు. జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి మిగిలిపోయిన చిన్నారులకు పోలియో డ్రాప్స్ అందించేందుకు మొబైల్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి.
* నాలుగు జిల్లాల్లో అదనంగా మరో రోజు
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో పట్టణ ప్రాంతాలు విస్తృతంగా ఉండటంతో జూలై 1న అదనంగా మరో రోజు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
* తల్లిదండ్రులకు ఆరోగ్య శాఖ విజ్ఞప్తి
పిల్లలకు గతంలో పలుమార్లు పోలియో చుక్కలు తాగించినప్పటికీ, ఈసారి కూడా తప్పనిసరిగా వేయించాలని ఆరోగ్య శాఖ సూచించింది. పోలియో రహిత తెలంగాణ లక్ష్య సాధనలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని అధికారులు కోరుతున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
