Mailaram Bike Accident News
* బైక్ బోల్తా: ముగ్గురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
ఆకేరు న్యూస్, రాయపర్తి:
మండల పరిధిలోని మైలారం గ్రామ శివారులో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే ద్విచక్రవాహనంపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బోర్డును బలంగా డీకొట్టారు.
ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాధితులను చికిత్స నిమిత్తం వరంగల్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు మైలారం గ్రామానికి చెందిన కుక్కల రాకేష్, పేరబోయిన అశోక్, కొమ్ము సురేష్‌లు గా గుర్తించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా, ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
