Mulugu Tribal Day Celebrations
ఆకేరున్యూస్,ములుగు :ములుగు జిల్లా వ్యాప్తంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం వేడుకలను ఆదివాసి లు ఆదివారం ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా ఎటూర్ నాగారం, తాడువాయి, పసర, కొండపర్తి,కాల్వపెల్లి, మేడారం తదితర గ్రామాలలో ఆదివాసి పోరాట యోధుడు కొమరం భీమ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పలు పలువురు ఆదివాసి నాయకులు మాట్లాడుతూ..
జీవో నెంబర్ .3 ని, 1/70 చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీ హక్కులను ఆదివాసీలు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాజ్యాంగం లో ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో నిబంధనలు అమలు చేయాలని,342 నిబంధన ప్రకారం ఆర్టికల్ 19 (ఇ) ఏజెన్సీ సర్టిఫికెట్స్ ఇవ్వాలని కోరారు. ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన బిర్సా ముండా, కొమరం భీమ్ ఆశయాలను స్మరించుకున్నారు. “జల్.. జంగల్.. జమీన్” నినాదాలతో ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, జల్–అడవి–భూమిపై హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆదివాసీ సమాజ అభ్యున్నతికి యువత ఐక్యంగా ముందుకు సాగాలని, ఆదివాసీ నాయకులు పోరాట స్ఫూర్తిని నేటి తరానికి అందించాలని సూచించారు.
కాల్వ పెల్లి లో కార్యక్రమంలో ఆదివాసీ విద్యార్ధి సంఘం రాష్ట అధ్యక్షుడు కొప్పుల రవి ,ఆశ్రమ పాఠశాల ప్రినిపాల్ ఈసం నర్సయ్య , సర్పంచ్ కోరగట్ల సృజన వెంకన్న,ఉప సర్పంచ్ సిద్ధ బోయిన కార్తిక్, ఆదివాసీ సేన ములుగు జిల్లా కన్వీనర్ ఆలం శ్రీను, తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు కొప్పుల జగన్, కుడుముల రంజిత్, సగలం లవకుమార్, విగ్రహ ప్రతిష్టాత్మక కమిటీ అధ్యక్షుడు కొప్పుల శ్యామ్, కుడుముల రాజు ,వార్డు మెంబర్ లు కోరగట్ల సాయికిరణ్, సిద్ధబోయిన సాయికిరణ్, కొప్పుల కార్తిక్, కళ్యాణి కళా బృందం మధు, గ్రామ పెద్దలు బడే సతీష్, కుడుముల రమేష్ ,కొప్పుల కృష్ణారావు, సిద్ధబోయిన శ్రీనివాస్, వెంకయ్య, మహిళా సంఘాలు కొప్పుల లక్ష్మీ, సిద్ధ బోయిన సారా లక్ష్మి ,నీలమ్మ ,సుజాత ,శంకరమ్మ, తాడువాయి మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరసింహ స్వామి, నాయకులు ముక్తి రామస్వామి కోటేశ్వరరావు ఇరుప సీతారాములు, తదితరులు పాల్గొన్నవారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
