Banoth Ravi chander, Mulugu Residents Warned Against Fraudulent Agents
* ములుగు జిల్లా ప్రజలకు గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ సూచన
ఆకేరు న్యూస్, ములుగు:
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలలో ఇందిరమ్మ ఇళ్లు,కొత్త పింఛన్లు,ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు దళారులు జిల్లాలోని అమాయకుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని సమాచారం ఉన్నందున ములుగు జిల్లా ప్రజలు ఎవ్వరు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ కోరారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు రకాల ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అర్హతలను బట్టి , పేద ప్రజలలో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు,ఉద్యోగాలు వస్తాయని తెలిపారు .జిల్లా ప్రజల అభివృద్ధికి మంత్రి సీతక్క నిత్యం కృషి చేస్తున్నారని దళారుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని ఆయన జిల్లా ప్రజలకు సూచించారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు ప్రజా ప్రభుత్వం అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
