Cricketer Sreesanth and his Father Shanthakumaran nair
* తండ్రి వి. శాంతకుమారన్ నాయర్ మృతి
* ఆదివారం అంత్యక్రియలు
ఆకేరు న్యూస్, డెస్క్ : టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి వి.శాంతకుమారన్ నాయర్ (89) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కోచిలోని లిసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
* కుటుంబ సభ్యులు విదేశాల్లో..
శాంతకుమారన్ నాయర్ భౌతికకాయాన్ని ప్రస్తుతం ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. శ్రీశాంత్ కుటుంబ సభ్యుల్లో కొందరు విదేశాల్లో ఉండటంతో.. వారు స్వదేశానికి చేరుకున్న తర్వాత భౌతికకాయాన్ని కొత్తమంగళంలోని నివాసానికి తరలించనున్నారు. శనివారం బంధువుల రాక పూర్తయ్యాక అంతిమ దర్శనానికి ఏర్పాట్లు చేయనున్నారు.
* ఆదివారం అంత్యక్రియలు..
ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అభిమానులు, బంధువుల సందర్శనార్థం భౌతికకాయాన్ని నివాసంలో ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు సొంత గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతికి పలువురు మాజీ క్రికెటర్లు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
* శ్రీశాంత్ క్రికెట్ ప్రస్థానం..
43 ఏళ్ల శ్రీశాంత్ 2022లో అన్ని ఫార్మాట్ల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. భారత్ తరఫున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20 మ్యాచ్లు ఆడారు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 87, 75, 7 వికెట్లు సాధించారు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో శ్రీశాంత్ సభ్యుడిగా ఉన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
