Radhika Apte
Allu Sirish| ఆకేరు న్యూస్, హైదరాబాద్: నగరంలోని ఓ హనుమాన్ ఆలయం నుంచి అర్ధరాత్రి వరకు వస్తున్న భారీ శబ్దాలపై నటుడు అల్లు శిరీష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను హైదరాబాద్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. షేక్‌పేట్‌లోని అపర్ణ వన్‌లో తాను నివసిస్తున్నట్లు పేర్కొన్న శిరీష్.. వినోభా నగర్‌లోని హనుమాన్ ఆలయంలో గత కొన్ని రోజులుగా నిర్ణీత డెసిబెల్స్‌కు మించి రాత్రి 2–3 గంటల వరకు పెద్ద శబ్దంతో సంగీతం వినిపిస్తున్నట్లు ఎక్స్‌లో వెల్లడించారు.
వృద్ధులు, చిన్నారులకు ఇబ్బందులు
భారీ శబ్దాల కారణంగా చుట్టుపక్కల నివసించే వృద్ధులు, చిన్నారులు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శిరీష్ తెలిపారు. ఈ సమస్యపై గతంలో ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌ను కూడా ఆశ్రయించినట్లు చెప్పారు. అయితే గణేశ్ నిమజ్జనం కారణంగా సెప్టెంబర్ 25 వరకు భరించాలని పోలీసులు సూచించినట్లు వెల్లడించారు.
అయితే గణేశ్ నిమజ్జనం పూర్తయిన తర్వాత కూడా శబ్దాలు కొనసాగుతున్నాయని, పలువురు స్థానికులు ఈ విషయంపై ఫిర్యాదులు చేసినట్లు శిరీష్ పేర్కొన్నారు.
స్పందించిన హైదరాబాద్ పోలీసులు
అల్లు శిరీష్ ఫిర్యాదుపై హైదరాబాద్ సిటీ పోలీసులు స్పందించారు. స్థానిక పోలీసు సిబ్బంది ఆలయానికి వెళ్లి నిర్వాహకులతో మాట్లాడినట్లు తెలిపారు. శబ్ద తీవ్రతను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆలయ నిర్వాహకులకు సూచించినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని శిరీష్ ఎక్స్ వేదికగా హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేస్తూ వెల్లడించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
