* 20కిలోమీటర్ల వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: ఇకనుంచి ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ చార్జీ వసూలు చేసేలా కేంద్రం శాటిలైట్ ఆధారిత టోల్ విధానాన్ని అమల్లోకి తెస్తోంది. ఇందుకు గాను వాహనాలకు ఫంక్షనల్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ వ్యవస్థ (జీఎన్ ఎస్ ఎస్) ఉండాలి. ఇది ఉన్న ప్రైవేటు వాహన యజమానులు 20కిలోమీటర్ల వరకు ఎటువంటి రుసుము చెల్లించకుండా ప్రయాణించవచ్చని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ఈ మేరకు జాతీయ రహదారుల చార్జీల నియమాలను సవరించింది. 20కిలోమీటర్లు దాటి ఎంతదూరం ప్రయాణించారో దాన్ని బట్టి చార్జీ వసూలు చేస్తారు. జీఎన్ఎస్ఎస్ లేని వాహనాలకు సాధారణ చార్జీలే వర్తిస్తాయి. ఫాస్ట్ ట్యాగ్ తో పాటు అదనపు సౌకర్యంగా పైలట్ ప్రాతిపదికన ఎంపిక చేసిన జాతీయ రహదారుల వద్ద జీఎన్ఎస్ఎస్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని మొదట అమలు చేయాలని నిర్ణయించినట్లు జూలైలో రహదారి మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
—————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
