Woman's Burnt Body Found Dumped in Garbage Heap in Hyderabad
* హైదరాబాద్‌లో దారుణం
* యువతి మృతదేహాన్ని చెత్తలో పడేసి దహనం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతి మృతదేహాన్ని చెత్తలో పండేసి కాల్చేశారు. లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఉదయం వెలుగులోకి వచ్చిన సంఘటనలో అక్కడ కాల్చేసింది యువకుడి మృతదేహమని పోలీసులు తొలుత భావించారు. దర్యాప్తులో ఆమె యువతి అని తెలియడంతో సంచలనంగా మారింది. దీని వెనుక ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
దోమలగూడ పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి 11 గంటల తర్వాత హైదరాబాద్‌లోని లోయర్‌ట్యాంక్ బండ్ వద్ద చెత్తకుప్పల్లో ఓ యువతి మృతదేహాన్ని వేసి దుండగులు నిప్పంటించి తగులపెట్టారు. స్థానికులు ఇచ్చిన సమాచారం అందుకున్న దోమలగూడ పోలీసులు సంఘటనా చేరుకొని ఫైర్ ఇంజన్‌ను పిలిపించి మంటలు ఆర్పారు. మంటలలో సుమారు 30 సంవత్సరాల వయస్సు గల యువతి దాదాపుగా కాలిపోయి ఉంది. ఆమె శరీరం మొత్తం కాలిపోయి ఉండటంతో గుర్తు పట్టలేకుండా తయారయింది.
* ఎక్కడో చంపి.. ఇక్కడ తగులబెట్టారా?
ఆమె ఎక్కడో చంపేసి దోమలగూడకు తీసుకొచ్చి తగులబెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ యువతి మృతదేమాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. అయితే మంటలో కాలిపోయిన మృతదేహం యువకుడిదని తొలుత పోలీసులు భావించగా ఆతర్వాత క్లూస్ టీం, యువతిగా ధ్రువీకరించినట్లు సిఐ తెలిపారు. యువతి మృతదేహాన్ని వాహనంలో తీసుకువచ్చి చెత్తకుప్పలో పడేసి కాలబెట్టారా లేక ఇక్కడనే హత్యచేసి తగులబెట్టారా అనే కోణాలలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజీలు ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించారు.
Also Read :
Please tell us what is wrong. Your report will be sent to the website team.
