Bhupalapally Govt Hospital
* పసికందుల వార్డులో పైకప్పు ఊడిపడి..
* తృటిలో తప్పిన ప్రమాదం
ఆకేరు న్యూస్, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పైకప్పు పెచ్చులు ఊడిపడటంతో తీవ్ర కలకలం రేగింది. నవజాత శిశువులకు అత్యవసర చికిత్స అందించే వార్డులోని సిమెంట్ ప్లాస్టరింగ్ ఒక్కసారిగా భారీ శబ్దంతో కూలిపడింది. దీంతో ఆసుపత్రి సిబ్బంది, రోగుల బంధువులు భయాందోళనకు గురయ్యారు.
నవజాత శిశువుల అత్యవసర సంరక్షణకు వినియోగించే అత్యంత సున్నితమైన వార్డులో ఈ ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే పైకప్పు పెచ్చులు కూలిన సమయంలో ఆ ప్రాంతంలో పసిపిల్లలు, ఆసుపత్రి సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అదే సమయంలో అక్కడ శిశువులు లేదా సిబ్బంది ఉంటే తీవ్ర ప్రమాదం జరిగి ఉండేదని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రులకు పేద ప్రజలు ఉచిత వైద్యం అందుతుందనే నమ్మకంతో వస్తుంటారని, అలాంటి ఆసుపత్రుల్లోనే భవనాల నిర్వహణ, నిర్మాణ నాణ్యతపై నిర్లక్ష్యం కనిపించడం ఆందోళనకరమని స్థానికులు, ప్రజాసంఘాల ప్రతినిధులు తెలిపారు..

Please tell us what is wrong. Your report will be sent to the website team.
