Wildlife Awareness Rally
* నర్సంపేటలో అటవీ సిబ్బంది సందడి
ఆకేరు న్యూస్, వరంగల్ జిల్లా : నర్సంపేట రేంజ్ పరిధిలో వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా రెండో రోజు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. FRO ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో అటవీ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. నర్సంపేట రేంజ్ కార్యాలయ పరిసరాల్లో పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారు.
అనంతరం వన్యప్రాణుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు.అదేవిధంగా పాకాల బయోడైవర్సిటీ పార్క్‌లోనూ శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ పరిశుభ్రత, జీవవైవిధ్య పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని అటవీ అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో నర్సంపేట రేంజ్ అటవీ సిబ్బంది పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
