Mega Job Mela Warangal KITS
అకేరు న్యూస్ హన్మకొండ : హనుమకొండలోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి వ్యవసాయాధారిత వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ (Ministry of Skill Development & Entrepreneurship) 2 (NSDC) ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ తెలిపారు.ఈ జాబ్ మేళాలో ఐటీ, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్, హెల్త్‌కేర్, బ్యాంకింగ్ తదితర రంగాలకు చెందిన 100కు పైగా ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయని, వరంగల్ పరిసర జిల్లాల నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ జాబ్ మేళాలో పాల్గొనడానికి ఎటువంటి రుసుము లేదని తెలిపారు.
* ప్రముఖుల చే ప్రారంభం
ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క), వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న), మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ వెంకటనారాయణ, మాజీ పార్లమెంట్ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె. నాగరాజు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొని ప్రారంభించనున్నట్లు తెలిపారు.
* అవినీతి రహిత సమాజం… లక్ష సైన్యం ప్రారంభం
అవినీతి రహిత సమాజ నిర్మాణ లక్ష్యంతో “లక్ష్యం కోసం లక్ష సైన్యం” కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా రిటైర్డ్ ఆర్మీ అధికారులు, మాజీ సైనికులు మరియు దేశభక్తి భావాలు కలిగిన యువతను సమీకరించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ అధికార ప్రతినిధి బీరప్ప మాట్లాడుతూ, రానున్న నల్గొండ- వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ తరపున కపిలవాయి దిలీప్ కుమార్ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. గతంలో ఆయన విజయానికి సహకరించిన భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ), భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) (సీపీఎం), భారత జాతీయ కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ (టీడీపీ) మరియు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, రానున్న ఎన్నికల్లో కూడా ఆయా రాజకీయ పార్టీల సహకారం మరియు మద్దతు కోరుతున్నట్లు తెలిపారు.
ఈ విలేకరుల సమావేశంలో టీఆర్ఎల్డీ వరంగల్ జిల్లా అధ్యక్షులు రాంప్రసాద్, టీఆర్ఎల్డీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు శ్రీ బుల్లెట్ వెంకన్న, టీఆర్ఎల్డీ రాష్ట్ర కోశాధికారి గిరి కుందే, రాష్ట్ర కార్యదర్శి కోటి, ప్రధాన కార్యదర్శి నరసింహారావు తదితర టీఆర్ఎల్డీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గడ్డం రాంప్రసాద్
వరంగల్ జిల్లా అధ్యక్షులు
తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్
+91 8978907134
Coordinators: 1. 2 – 9542632975
2. బుల్లెట్ వెంకన్న – 9640503757
Please tell us what is wrong. Your report will be sent to the website team.
