EV bike showroom inauguration
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ పట్టణ కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జెకె (ఇవి) ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ షో రూమ్ ని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈవీ వాహనాలను పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసున్న ఎమ్మెల్యే షో రూమ్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన వాహనాలను అందించడంతో పాటు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, చిల్పూర్ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, ప్రోప్రైటర్ ఎం. సురేష్, వైస్ చైర్మన్ నీల రాజమ్మ గట్టయ్య మున్సిపల్ కౌన్సిలర్లు బొల్లు లక్ష్మి, అంగిడి రజిత, పెసర కృష్ణవేణి సారయ్య, పొన్నం స్వరూప రాజయ్య, సంపత్ రాజు, పొన్న రవి పల్లగుట్ట సర్పంచ్ ఎనగందుల నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ రఫీ, పిఎసిఎస్ వాయిస్ చైర్మన్ చిర నాగరాజు, డైరెక్టర్ రత్నాకర్ రెడ్డి నాయకులు బుర్ల శంకర్, ఫాతి కుమార్, యూత్ నాయకుడు వినయ్ కుమార్ వివిధ గ్రామాల సర్పంచులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
