Kadiyam Srihari Ambedkar tribute
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
దళిత, బడుగు బలహీన వర్గాల దైవం, గోప్ప మానవతావాది, సంస్కరణవాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్బంగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ పట్టణలో భారీ ర్యాలీ నిర్వహించారు. శివునిపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి బస్టాండ్ సెంటర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ వాదులకు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప మానవతా వాది, సంస్కరణవాది అని కొనియాడారు. దళితులకు దైవ సామానులైన అంబేద్కర్ చూపిన మార్గంలో పయనిస్తూ అయన ఆశయాల సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతి గొప్ప లిఖితపూర్వక రాజ్యాంగాన్ని దేశానికి అందించిన మహానుభావుడని తెలిపారు. అనేక శతబ్దాలుగా అణచివేతకు, అవమానాలకు గురవుతున్న దళిత సమాజాన్ని మేలుకొల్పాలి, సమాన అవకాశాలు కల్పించాలని రాజ్యాంగంలో హక్కులను, రిజర్వేషన్లను కల్పించారాని అన్నారు. నేడు నా లాంటి ఎంతో మంది సామజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యా పరంగా ఉన్నత స్థాయికి చేరుకోగలిగారు అంటే అది అంబేద్కర్ పెట్టిన బిక్షేనని వెల్లడించారు. దేశంలో అసమానతలు, వివక్షలు, అవమానాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని అన్నారు. అయితే కొందరు రాజ్యాంగానికి తూట్లు పొడవాలని, దళితుల రిజర్వేషన్లను కలరాసే ప్రయత్నం చెస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కుల విద్వేషాలను, మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. దళితులపైన దాడి చేస్తోందని ఇది ప్రజాస్వామ్యనికి మంచిది కాదని అన్నారు. ఇటీవల సుప్రీం కోర్టు దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు వర్తించవని ఇచ్చిన తీర్పు సరైంది కాదని సుప్రీం కోర్టు పునర్ సమీక్షించుకోవాలని కోరారు. పుట్టుకతోనే కులం వస్తుందని కానీ మతం మధ్యలో వస్తుందని అన్నారు. దేశంలో కుల వ్యవస్థ ఉన్నన్ని రోజులు, అంటరానితనం, అసమానతలు, అవమానాలు ఉన్నన్ని రోజులు రిజర్వేషన్లు కొనసాగాలని స్పష్టం చేశారు. రాజ్యాంగంపై, దళితుల రిజర్వేషన్లపై జరుగుతున్న కుట్రలను అడ్డుకోవాలంటే పోరాటం ఒక్కటే మార్గమని తెలిపారు. పోరాడాలంటే అవగహన, చైతన్యం, చదువు అవసరమని దళితుందరూ చదువును ఆయుధంగా చేసుకొని ఐక్యంగా మన హక్కులను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. నియోజకవర్గ కేంద్రంలో నిర్మాణం అవుతున్న ఇంటిగ్రెటెడ్ రెవిన్యూ డివిజనల్ కార్యాలయానికి అంబేద్కర్ సచివాలయంగా నామకరణం చేసి ఆయన నివాళులు అర్పిస్తానని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డివో వెంకన్న, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, తహసీల్దార్ స్వప్న, ఎంపిడివో జయశ్రీ, దళిత సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
