SI Mahender Reddy Kishtapur CCTV Inauguration
* కిష్టాపురంలో సీసీ కెమెరాలు, హెల్మెట్లను పంపిణీ చేసిన ఎస్సై మహేందర్ రెడ్డి
ఆకేరు న్యూస్,తొర్రూర్:
సామాజిక బాధ్యతతో చేపట్టిన సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఆదర్శంగా నిలుస్తాయని తోరూర్ స్థానిక ఎస్ఐ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా తోరూర్ మండల పరిధిలోని కిష్టాపురం గ్రామ సర్పంచ్ నకిరేకంటి మాధవి భర్త నకిరేకంటి సంపత్ జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రామంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా విశిష్ట.అతిధిగా తొర్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కన్న మహబూబ్ రెడ్డి, లు కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎస్ఐ ప్రారంభించారు. అనంతరం ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేయడంతో పాటు, పర్యావరణ పరిరక్షణను కాపాడాలనే లక్ష్యంతో మొక్కలు నాటారు.
* కార్యక్రమంలో ఎస్ఐ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ:
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు: గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాలు తగ్గడమే కాకుండా, గ్రామస్తుల భద్రతకు పటిష్టమైన రక్షణ లభిస్తుందని తెలిపారు.
రోడ్డు భద్రతపై అవగాహన: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని, హెల్మెట్ ప్రాణ రక్షణ కవచమని పిలుపునిచ్చారు.
హరితహారం స్పూర్తి: ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
సర్పంచ్ భర్త సంపత్ తన పుట్టినరోజు సందర్భంగా ఆడంబరాలకు పోకుండా గ్రామాభివృద్ధికి, ప్రజల భద్రతకు ఉపయోగపడేలా సీసీ కెమెరాలు, హెల్మెట్ల పంపిణీ, మొక్కలు నాటే కార్యక్రమం చేపటడం అభినందనీయమని ఎస్ఐ ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నకిరికంటి మాధవి సంపత్, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, పోలీసులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంపత్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు
Please tell us what is wrong. Your report will be sent to the website team.
