Wardhannapet Congress
ఆకేరు న్యూస్, హన్మకొండ : వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని డివిజన్ కమిటీల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ సమన్వయకర్తలను నియమించింది. స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు సూచన మేరకు డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి వివిధ డివిజన్లకు జిల్లా కమిటీ నుంచి సమన్వయకర్తలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
డివిజన్ అధ్యక్షులతో సమన్వయం చేసుకుంటూ కమిటీల భర్తీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని నియమితులైన సమన్వయకర్తలకు సూచించారు.
1, 65, 66 డివిజన్లకు ఈర్ల చిన్ని, మారంరెడ్డి కౌథిల్ రెడ్డి, ముక్కెర సురేష్లను సమన్వయకర్తలుగా నియమించారు.
2, 55, 56 డివిజన్లకు దొగ్గెల రాజేశ్వర్ రావు, మడికొండ సంపత్‌లను సమన్వయకర్తలుగా నియమించారు.
44, 45, 46, 64 డివిజన్లకు కొయ్యడ శ్రీనివాస్, శనిగరపు వీరేశ లింగం, పర్నెం తిరుపతి రెడ్డిలను సమన్వయకర్తలుగా నియమించారు.
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ.. నియమితులైన నాయకులంతా సంబంధిత డివిజన్ అధ్యక్షులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. వీలైనంత త్వరగా డివిజన్ కమిటీల ఏర్పాటును పూర్తి చేసి పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయాలని కోరారు.
డివిజన్ స్థాయిలో పార్టీ కార్యకలాపాలను మరింత పటిష్టం చేయడంతో పాటు, నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ కమిటీల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన సూచించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
