* వ్యక్తిత్వ హననం.. నీకు తగునా జగన్
– వైఎస్ వివేకా భార్య బహిరంగ లేఖ
ఆకేరు న్యూస్, విజయవాడ : ‘‘నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తపించిన చిన్నాన్నను ఈ విధంగా నీ పత్రిక, ఛానెల్, సోషల్ మీడియాలో హననం చేయించడం తగునా? న్యాయం కోసం పోరాటం చేస్తున్న చెల్లెళ్ళను హేళన చేస్తూ నిందలు మోపుతూ, దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే నీకు మాత్రం పట్టడం లేదా?’’ అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ను ఆయన చిన్నమ్మ, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్య ప్రశ్నించారు. ఈ మేరకు జగన్ కు బహిరంగ లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. వివేకా హత్య కేసులో వైసీపీ తీరు, అవినాష్ కు జగన్ మద్దతు వంటి అంశాలను ఆమె లేఖలో ప్రస్తావించారు.
2009 లో నువ్వు మీ తండ్రిని కోల్పోయినప్పుడు ఎంతో మనోవేదన అనుభవించావు.. 2019 లో తన తండ్రి చనిపోయినప్పుడు నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదన అనుభవించిందని సౌభాగ్యమ్మ సీఎం జగన్ కు గుర్తుచేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు మమ్మల్ని ఎక్కువగా బాధపెట్టినట్లు తెలిపారు. మన కుటుబంలోనీ వారే హత్యకు కారణం కావడం, హత్యకు కారణం ఆయిన వాళ్లకు నువ్వు రక్షణం గా ఉండటం సరికాదన్నారు. సునీతకు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తున్న షర్మిల ను కూడా టార్గెట్ చేస్తుంటే, నీవు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ఏంటన్నారు. కుటుంబ సభ్యునిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఇదేనా నీ కర్తవ్యం అని ప్రశ్నించారు. ఇంకా బాధించే అంశం..హత్యకు కారకులైన ఆయిన వారికి మరలా ఎంపీగా అవకాశాన్ని నీవు కల్పించడం…ఇది సమంజసమా అని అడిగారు. ఇటువంటి దుశ్చర్యలు నీకు ఏ మాత్రం మంచిది కాదన్నారు. హత్యకు కారకుడు ఆయిన నిందితుడు నామినేషన్ దాఖలు చేసినందున , చివరి ప్రయత్నంగా…న్యాయం ధర్మం ఆలోచన చేయమని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రాగ ద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని, ప్రమాణం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా, న్యాయం,ధర్మం,నిజం వైపు నిలబడమని నిన్ను వేడుకుంటున్నట్లు సౌభాగ్యమ్మ తెలిపారు.
—————————-