Ailoni Vishishta Wins Drawing Competition
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్
పోలీసుల ఆధ్వర్యంలో ‘ఆంటీ డ్రగ్స్’ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ పోలీసులు నిర్వహించిన డ్రాయింగ్ పోటీలో మండలం తాటికొండ కు చెందిన ‘ఐలోని విశిష్ట’ ప్రథమ బహుమతి అందుకుంది. ఇటీవల స్టేషన్ ఘన్పూర్ మునిసిపాలిటీ పరిధిలోని బాలికల ఉన్నత పాఠశాలలో పోలీసుల ఆధ్వర్యంలో ఆంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. సెయింట్ మేరీ హై స్కూల్ లో 10వ తరగతి చదువుతున్న మండలంలోని తాటికొండకి చెందిన ఐలోని స్వప్న-లింగమూర్తి దంపతులకు కూతురు ఐలోని విశిష్ట డ్రాయింగ్ పోటీలలో ప్రథమ బహుమతి గెలుచుకుంది. ఈ బహుమతి జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్, స్టేషన్ ఘన్ పూర్ ఏసిపి భీమ్ శర్మ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ జి.వేణు, ఎస్ఐ పిట్ట రాజేష్, ఎస్ఐ మనీషా, పోలీస్ సిబ్బంది, ఉపాధ్యా యులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొ న్నారు. డ్రాయింగ్ పోటీలలో ప్రధమ బహుమతి అందుకున్న ఐలోని విశిష్టను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
