Jangaon Electric Shock Death
ఆకేరు న్యూస్, జనగామ:
జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బట్టలు ఆరేసేందుకు వెళ్లిన ఒక మహిళ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ప్రాణాలు కోల్పోయింది.
* స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…
పాలకుర్తి మండలం శాతపురం గ్రామానికి చెందిన రాగిరి అనిత (38) సోమవారం తన ఇంటి వద్ద ఉతికిన బట్టలను ఆరేసేందుకు దండెం వద్దకు వెళ్ళింది. ఈ క్రమంలో బట్టల దండెంకు ప్రమాదవశాత్తు విద్యుత్ సరఫరా కావడంతో ఆమె తీవ్రమైన కరెంట్ షాక్కు గురైంది. విద్యుత్ ప్రవాహ ధాటికి తీవ్రంగా గాయపడిన అనిత అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
కుటుంబసభ్యుల కళ్లముందే ఈ ఘటన జరగడంతో గ్రామంలో తీవ్ర శోకసంద్రం అలుముకుంది. సమాచారం అందుకున్న పాలకుర్తి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
